సుజిత్ – పవన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్!

సుజిత్ – పవన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్!

Published on Jan 30, 2023 11:27 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ ఒక తుఫాన్ ను సృష్టించింది. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇదే విషయాన్ని థమన్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మేము OG తో ప్రారంభిస్తాం అంటూ పవన్ – సుజిత్ ల సినిమా కి సంబందించిన పోస్టర్ ను షేర్ చేశారు థమన్. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలకు థమన్ అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మరి ఈ చిత్రానికి అంతకు మించి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు