పుష్ప సీక్వెల్‌పై సుకుమార్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

Published on May 13, 2022 7:30 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప-ది రైజ్”. గత ఏడాది చివరలో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడంతో పుష్ప సీక్వెల్‌ని సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందులో భాగంగా ముందు రాసుకున్న స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి భారీతనంతో రూపొందించాలని నిర్ణయించాడట.

ఈ కారణంగానే ఫిబ్రవరిలోనే సెట్స్ మీదికి వెళ్ళాళ్సిన ఈ సినిమా ఇంకా మొదలుకాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బలంగా వినిపిస్తుంది. పుష్ప సీక్వెల్ కోసం సుకుమార్ ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్‌ని కేటాయించనున్నాడట. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై నలేని క్రేజ్ నెలజొండంతో ఆయా ఇండస్ట్రీలో పేరుగాంచిన నటీనటులను రంగంలోకి దింపుతున్నాడట. అంతేకాకుండా పాటల దగ్గర నుంచి ఫైట్ల దాకా ప్రతీది డ్రాండ్‌గా ఉండేలా సుకుమార్ డైజైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. “పుష్ప-ది రైజ్”కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ ఇంత భారీ లెవల్‌లో ప్లాన్ వేసినట్టు టాక్.

సంబంధిత సమాచారం :