సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇదే!

Published on Dec 23, 2021 8:30 pm IST


రంగస్థలం చిత్రం తర్వాత పుష్ప మొదలు పెట్టిన సుకుమార్, మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ తో భారీ హిట్ సాధించారు. పుష్ప ది రైజ్ అనంతరం పుష్ప ది రూల్ కి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్స్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సుకుమార్ తన నెక్స్ట్ సినిమాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.

పుష్ప ది రూల్ అనంతరం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయనున్నారు సుకుమార్. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో మరొక సినిమా చేయనున్నట్లు తెలిపారు. రంగస్థలం తర్వాత మరొకసారి రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ అనడం తో ఇప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాక విజయ్ దేవరకొండ సైతం ప్రస్తుతం లైగర్ తో పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. సుకుమార్ వరుస పాన్ ఇండియా మూవీ లు చేస్తుండటం తో వీటి పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :