“ఓం భీమ్ బుష్” టీంతో సుమ అడ్డా ఫన్ ప్రోమో!

“ఓం భీమ్ బుష్” టీంతో సుమ అడ్డా ఫన్ ప్రోమో!

Published on Mar 20, 2024 6:05 PM IST

యంగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem bush). మార్చి 22, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తించింది. సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను టీమ్ వేగవంతం చేయడం జరిగింది.

సుమ అడ్డా కార్యక్రమం కి ఓం భీమ్ బుష్ టీమ్ గెస్ట్ గా వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫన్ రైడ్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. కామెడీ డైలాగులు, పంచ్ లు ఆకట్టుకున్నాయి. అయితే ఓం భీమ్ బుష్ టీమ్ ప్రోమో చివరలో సుమ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ది నెస్ట్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ వాళ్ళు వచ్చి, సుమ బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మార్చ్ 23 న రాత్రి 9:30 గంటలకు ఈటీవీ లో ప్రసారం కానుంది.

సన్నీ MR సంగీతం అందించిన ఓం భీమ్ బుష్ లో ప్రియా వడ్లమని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు