హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న సుమంత్ సినిమా !
Published on Mar 11, 2018 6:35 pm IST

ఇటీవలే ‘మళ్ళీరావా’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన హీరో సుమంత్ ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఇదం జగత్’ అనే భిన్నమైన టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో సుమంత్ కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

వైజాగ్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్, గచ్చిబౌలిలో షూటింగ్ జరుపుకుంటోంది. సుమంత్, కమెడియన్ సత్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో మలయాళ నటి అంజు కురియన్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయంకానుంది.

 
Like us on Facebook