మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ “మాయవన్” టీజర్!

మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ “మాయవన్” టీజర్!

Published on May 9, 2024 3:01 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారి గా ఊరు పేరు భైరవకోన చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో అలరించే సందీప్ కిషన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ముందుకి వచ్చారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సివి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాయవన్. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ టీజర్ ను నేడు రిలీజ్ చేశారు.

రిలీజైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమా మంచి ఎంటర్ టైనర్ లాగా ఉండనున్నట్లు టీజర్ ను చూస్తే తెలుస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు