షారుఖ్ ఖాన్ “పఠాన్” కి భారీ క్రేజ్..!

షారుఖ్ ఖాన్ “పఠాన్” కి భారీ క్రేజ్..!

Published on Dec 31, 2022 12:24 AM IST

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం పఠాన్. ఈ భారీ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్‌కి వార్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ అందించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు IMDb యొక్క పోస్టర్‌ను విడుదల చేసింది. పఠాన్ చిత్రం అత్యంత ఎదురుచూసిన భారతీయ చిత్రం అని పేర్కొంది.

షారుఖ్ ఖాన్ వెండితెర పై కనిపించి చాలా రోజులైంది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొణె మరియు జాన్ అబ్రహం ఇతర కీలక పాత్రల్లో నటించిన పఠాన్ హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో 25 జనవరి 2023న విడుదల కానుంది. థియేట్రికల్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం పై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు