“బ్రో”…మోషన్ పోస్టర్ కి రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

Published on May 19, 2023 11:05 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అయితే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ బ్రో అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ మోషన్ పోస్టర్ కి రెస్పాన్స్ మామూలుగా లేదు. మొత్తం 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతుంది.

24 గంటల్లో యూ ట్యూబ్ లో 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, ఇన్స్టాగ్రామ్ లో 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. మొత్తం గా రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పాలి. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :