పిక్ టాక్ : జిమ్ లో వర్కౌట్స్ అదరగొడుతున్న సూపర్ స్టార్

పిక్ టాక్ : జిమ్ లో వర్కౌట్స్ అదరగొడుతున్న సూపర్ స్టార్

Published on Nov 10, 2022 1:31 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా SSMB28 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వర్క్ చేస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ కోసం యూనిట్ సిద్ధం అవుతోంది.

ఇక అతి త్వరలో జరుగనున్న ఈ మూవీ కోసం ఇటీవల తన మేకోవర్ ని చాలా వరకు చేంజ్ చేసిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, నేడు జిమ్ లో ఎంతో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్న పిక్ ని ఆయన భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇప్పటికే రోజు రోజుకు ఎంతో యాంగ్ గా మారిపోతున్న సూపర్ స్టార్ మహేష్, తరచు క్రమం తప్పకుండా చక్కని డైట్, అలానే పక్కాగా వ్యాయామం చేస్తుంటారు అనేది తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీని 2023, ఏప్రిల్ 28న సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు