‘ప్రేమమ్’ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్

Premam-m
త్వరలో విడుదలకానున్న నాగ చైతన్య చిత్రం ‘ప్రేమమ్’ ఆడియో కార్యక్రమం నిన్ననే జరిగింది. ఈ సందర్బంగా యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 248,534 మంది ట్రైలర్ ను వీక్షించారు. ఇందులో నాగ చైతన్యను స్కూల్ కుర్రాడిగా, కాలేజ్ స్టూడెంట్ గా చూపిస్తూ, అతని లైఫ్ లోని మూడు దశల్లో ఉన్న ప్రేమ కథలను కూడా కొంచెం కొంచెంగా చూపారు. దీంతో ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, శృతి హాసన్ లతో చైతు కెమిస్ట్రీ చాలా బాగా కుదిరినట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన ఆడియో వేడుకలో నాగార్జున కూడా ఈ చిత్రం ‘గీతాంజలి’ అంతటి విజయాన్ని సాధించి క్లాసిక్ గా నిలుస్తుందన్న ధీమాని వ్యక్తం చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతం అందించాగా చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నారు.