గ్యాంగ్ తో వస్తోన్న హీరో సూర్య !
Published on Nov 25, 2017 1:20 pm IST

తమిళ్ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ హీరో సూర్య‌తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీకి తమిళ్తా లో నా సెంద కూట్టం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ సింగల్ ట్రాక్ విడుదల చేసారు. వాటికి మంచి ఆదరణ లభించింది. ఈవారంలో టిజర్ విడుదల చెయ్యబోతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకుడు.

సూర్య ఇందులో స‌రికొత్తగా క‌నిపిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలుగులో గ్యాంగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. గ్యాంగ్ మూవీని సంక్రాంతికి తెలుగు తమిళ భాసల్లో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు నిర్మాతలు.

 
Like us on Facebook