సూర్య పేరిట ఒక వైరల్ అవుతున్న ఫేక్ లెటర్.. దానిపై వివరణ ఏమిటంటే.!

Published on Jan 9, 2022 7:08 am IST

సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ లవ్డ్ కోలీవుడ్ స్టార్స్ లో నటుడు హీరో సూర్య కూడా ఒకరు. తమిళ్ మరియు తెలుగు లో సూర్య సినిమాలకి ఓకేలాంటి ఆదరణ లభిస్తుంది. అయితే కెరీర్ పరంగా లాస్ట్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు అందుకున్న సూర్య ఈ మధ్య పలు సేవా కార్యక్రమాలు కూడా అధికంగానే చేస్తూ వస్తున్నాడు. మరి ఈ సందర్భంలో సూర్య పేరిట ఒక ఊహించని ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

అది పలువురు ప్రముఖులు నుంచి అభిమానులు వరకు వెళ్లిందట. అయితే ఏకంగా సూర్య సంతకం కూడా చేసి ఉన్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్ అని అందులో ఎలాంటి నిజం లేదు పైగా అసలు అది సూర్య రాయించలేదని కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసారు. ప్రస్తుతం అయితే ఆ లెటర్ ఎవరు స్ప్రెడ్ చేసారు? ఎవరు నుంచి వచ్చింది అనే వాటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం అయితే సూర్య తన మాస్ ప్రాజెక్ట్ “ఈటీ” లో బిజీగా ఉండగా అది వచ్చే ఫిబ్రవరి 4న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :