‘ఎన్ జికె’ లో రాజకీయనాయకుని పాత్రలో కనిపించనున్న సూర్య !
Published on Jun 24, 2018 3:40 pm IST


విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ఎన్ జికె . రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య రాజకీయనాయకుని పాత్రలో కనిపించనునున్నాడు సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు , ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇలియ దళపతి విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్రం కూడా అదే రోజు విడుదలకానుంది .ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం మరో విశేషం ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook