బాలయ్య మాటలపై ఎస్వి రంగారావు వారసులు ప్రెస్ నోట్.!

Published on Jan 26, 2023 8:02 am IST

రీసెంట్ గా టాలీవుడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” భారీ హిట్ కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ ని గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇదే ఈవెంట్ లో బాలయ్య చేసిన కామెంట్స్ కొన్ని అయితే సంచలనంగా మారాయి.

దివంగత దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎస్ వి రంగారావు గార్లపై చేసిన కామెంట్స్ వారి అభిమానులను నొప్పించాయి. అయితే అక్కినేని పై కామెంట్స్ కి గాను వారి వారసులు ప్రెస్ నోట్ ద్వారా తమదైన శైలి సమాధానం పంపగా లేటెస్ట్ గా అయితే బాలయ్య కామెంట్స్ ఎస్ వి రంగారావు వారసులు కూడా ప్రెస్ నోట్ ద్వారా సమాధానం అందించారు.

“నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం.” అని వారు వెల్లడించారు. దీనితో ఈ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :