వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “స్వాతిముత్యం”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “స్వాతిముత్యం”

Published on Jan 10, 2023 3:01 AM IST

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, మరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు స్వాతిముత్యం సినిమాతో అరంగేట్రం చేసి డీసెంట్ హిట్ కొట్టాడు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయిక గా నటించింది. తాజా వార్త ఏంటంటే, హిట్ అయిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసింది.

స్టార్ మా జనవరి 15, 2023న సంక్రాంతి స్పెషల్‌గా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రసారం చేయబోతోంది. రావు రమేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు