‘సైరా’ షూటింగ్ గ్యాప్ చిరంజీవి కోసమే !
Published on Feb 22, 2018 9:10 am IST

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డిల కలయికలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రం డిసెంబర్లో మొదలై జనవరి ఆరంభంలోనే మొదటి షెడ్యూల్ ను ముగించుకుంది. కానీ రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. ముందుగా ఫిబ్రవరిలో షూట్ తిరిగి మొదలవుతుందని చెప్పినా ఇప్పుడది మార్చి నెలకి వాయిదాపడింది.

ఇందుకు కారణం చిరంజీవి మేకోవరేనట. అవును నరసింహారెడ్డి పాత్రలో గంభీరంగా కనిపించే చిరు కథనాగుణంగా కొంచెం యుక్త వయసులో కూడ కనిపించాల్సి ఉందట. అందుకే ఆయన క్లీన్ షేవ్ చేసి, కొద్దిగా ఎక్కువ టైమ్ తీసుకుని ప్రత్యేక వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ బరువు బాగా తగ్గి స్లిమ్ గా కనబడాలని ట్రై చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మంచి ఫలితాల్ని కూడ రాబట్టారాయన.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, అమితాబ్, విజయ్ సేతుపతిలు నటించనుండగా టాప్ క్లాస్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

 
Like us on Facebook