టాలీవుడ్‌ పై మళ్లీ సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ !

టాలీవుడ్‌ పై మళ్లీ సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ !

Published on Nov 27, 2022 9:21 PM IST

హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక నెటిజన్లతో కూడా ఆమె ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అయితే, తాప్సీ తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘నేను దేనిగురించైనా మాట్లాడేముందు మంచి-చెడు చూస్తా. చెప్పాల్సిన విషయం ముఖం మీదనే చెప్పేస్తా. నేను ఇలా మాట్లాడటం కొందరికి నచ్చదు. అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్ చేస్తారు. అయినా లెక్క చేయను.

చివరగా టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ తనకు మంచి అవకాశాలు ఇచ్చిందని తాప్సీ స్పష్టం చేసింది. అయితే తాప్సీ కామెంట్స్ కి నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయినా గ్లామర్ బ్యూటీ తాప్సీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఇక ప్రస్తుతం తాప్సీ పన్నుకి బాలీవుడ్‌లో కూడా బాగానే గుర్తింపు ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు