టాక్..సూర్య మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కి రెడీ.!

Published on Jul 9, 2022 2:00 am IST

సౌత్ ఇండియా స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య నుంచు ఒక ఫుల్ లెంగ్త్ కం బ్యాక్ కోసం అందులోని థియేటర్స్ లో ఇవ్వాలని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సూర్య నుంచి మాంచి క్యామియో రోల్స్ పడుతున్నాయి కానీ హీరోగా మాత్రం మంచి సినిమా రావాలని అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా కోరుకుంటున్నారు.

మరి ఇప్పుడు అయితే సూర్య ఆల్రెడీ రెండు సినిమాలు లైన్ లో పెట్టగా మూడో సినిమాని కూడా స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ టాక్ ప్రకారం అయితే గత కొన్ని రోజులు నుంచి దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని రూమర్స్ ఉన్నాయి.

సంబంధిత సమాచారం :