వార్తల్ని వక్రీకరించొద్దంటున్న తమన్నా !
Published on Mar 7, 2018 11:33 am IST

సెలబ్రిటీల ప్రొఫెషనల్, పెర్సనల్ జీవితాలపై లేనిపోని రూమర్లు రావడం ఈ,మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇబ్బందికరమైన పుకార్లు పుట్టుకొస్తూ హీరోహీరోయిన్లకు తలనొప్పులు తెచ్చిపెట్టిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇలాంటి వార్తల పట్ల ఎన్నోసార్లు ఇక్కట్లు పడిన సెలబ్రిటీలు స్పందించగా తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా కూడ కొంత ఘాటుగానే స్పందించారు.

ఇదివరకే మీడియాతో సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయన్న తమన్నా తాజాగా ట్విట్టర్ ద్వారా టీఆర్ఫీ రేటింగ్స్ కోసం వార్తల్ని వక్రీకరించవద్దని, తన గురించి వార్తల్ని ప్రచురించాలి అనుకుంటే భాద్యతగా వ్యవహరించాలని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న తనను సంప్రదించాలని అంతేగాని లేనిపోనివి, తాను చెప్పనివి రాయవద్దని, యల్లో జర్నలిజం తగదని అన్నారు.

 
Like us on Facebook