తారక్ దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా !
Published on Oct 31, 2017 3:32 pm IST

‘అర్జున్ రెడ్డి’ భారీ సక్సెస్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అయన చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. అవి కూడా పెద్ద నిర్మాణ సంస్థల నిర్మాణంలో ఉండటం విశేషం. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఇటీవలే తారక్ తో ‘జై లవ కుశ’ చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబీ విజయ్ తో ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడని సమాచారం.

ఇప్పటికే ఆయన వినిపించిన ఒక స్టోరీ లైన్ కు దేవరకొండ ఓకే చెప్పాడని, దీంతో బాబీ పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ వార్తపై విజయ్, బాబీల నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుకు వర్కవుట్ అయితే బాబీ విజయ్ ను ఏ విధంగా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

 
Like us on Facebook