ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజినీ “లాల్ సలాం”?

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజినీ “లాల్ సలాం”?

Published on Mar 6, 2024 1:04 AM IST

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో జనవరి డిజాస్టర్ చిత్రం “లాల్ సలాం” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో యంగ్ హీరోస్ విష్ణు విశాల్ అలాగే నటుడు విక్రాంత్ లు నటించగా సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే ఈ చిత్రంలో ముఖ్య అతిధిగా సినిమా అంతా కనిపించారు. అయితే ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ లో కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.

దీనికి ముందు రజినీకాంత్ “జైలర్” లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నా కూడా ఈ చిత్రానికి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే నెక్స్ట్ ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయం కూడా సస్పెన్స్ గానే మారింది. కానీ తర్వాత ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా ఇప్పుడు అందులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఈ మార్చ్ 9 నుంచి అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు