విడుదల తేదీ : అక్టోబర్ 02 , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్ మరియు తదితరులు
దర్శకత్వం : జాసన్ సంజయ్
నిర్మాతలు : A. సుభాస్కరన్, G.K.M. తమిళ కుమరన్
సంగీతం : థమన్
ఛాయాగ్రహణం : కృష్ణన్ వసంత్
కూర్పు : కె.ఎల్. ప్రవీణ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ కి చెందిన గురు (సందీప్ కిషన్) తన తల్లికి ఎంతో ఇష్టమైన ఒక హోమ్ లైబ్రరీని నడుపుతుంటాడు. అయితే, తన తండ్రి చేసిన కోటి రూపాయల అప్పు అతన్ని వెంటాడుతూ, దాన్ని త్వరగా తీర్చాలనే తీవ్రమైన ఒత్తిడి వెంటాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అనుకోకుండా, విన్సెంట్ చేతుల్లో నడిచే సీజర్ అనే ప్రమాదకరమైన డ్రగ్ గురించి అతనికి తెలుస్తుంది. విన్సెంట్ వ్యాపారాన్ని మూసివేయించడానికి తగిన పక్కా ఆధారాలు తన దగ్గర ఉండటంతో, డబ్బు కోసం గురు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే, ఇదంతా పైనుండి కంట్రోల్ చేసేది ఇంటర్నేషనల్ స్మగ్లర్ కోట్లపాటి వెంకట రెడ్డి (సంపత్ రాజ్) అని. సో ఫైనల్ గా గురుకి ఆ డబ్బు దొరికిందా లేదా? లేదా విలన్ల చేతిలో నలిగిపోయాడా? తన తండ్రి చేసిన అప్పు తీర్చాడా లేదా అన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు జాసన్ సంజయ్ విజన్ ను సందీప్ కిషన్ పూర్తిగా నమ్మి, అతను అడిగింది సిన్సియర్ గా అందించాడు. సినిమా మొత్తం సందీప్ నిజాయితీగా వర్క్ చేసాడు. తన హార్డ్ వర్క్ అంతా సినిమాలో కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా తాను బాగా కనిపించాడు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది, కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైన ఆమె ఉన్నంతలో ఓకే అనిపించింది. విలన్ సంపత్ రాజ్ కు సినిమాలో ఎక్కువ రన్‌టైమ్ దక్కింది, తనదైన స్టైల్ లో విలన్ పాత్రను సంపత్ బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను తీసుకోవడం పర్వాలేదు కానీ, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం బిగ్ మైనస్ అయ్యింది. సినిమా ఆరంభమే డల్ గా ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ ట్రాక్ లు కూడా ఎలాంటి సోల్ లేకుండా కనిపిస్తాయి.
ఇక ఇంటర్వెల్ సమయానికి, కేవలం ఒక డ్రమాటిక్ ట్విస్ట్ ఇవ్వడం కోసం కామన్ సెన్స్ ను పక్కన పెట్టేశారు. గురు తన జీవితాంతం కాపాడుకోవాలనుకున్న ఒక విషయాన్ని కోల్పోతాడు, కానీ అతని ముఖంలో ఎలాంటి నిజమైన బాధ లేదా విచారం కనిపించదు. ఆ ఎమోషనల్ సీన్ లో ఎలాంటి లోతు లేకపోవడం వల్ల, ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. ఇవన్నీ సినిమాని చాలా కృత్రిమంగా అగుపించేలా చేస్తాయి.
కథనం ఒక లక్ష్యం లేకుండా ఎటెటో తిరగడంతో సెకాండాఫ్ చూసే ఆడియెన్ సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో మరియు అతని గ్యాంగ్ ఎలాంటి ఇబ్బందులు పడకుండా, విదేశాలకు వెళ్లి ఒక భారీ దోపిడీని ఎలా చేశారనే దానికి ఎలాంటి లాజిక్ ఉండదు. ఇలాంటివి అన్ని చాలా సిల్లీగా అనిపిస్తాయి.
ఇంకా సింపుల్ సన్నివేశాలను ఎందుకంత గందరగోళంగా మార్చారో, ఒకే తరహా సీన్లు పదే పదే ఎందుకు రిపీట్ అవుతున్నాయో అర్థంకాక చికాకు పుడుతుంది. సీరియస్ సన్నివేశాల మధ్యలో ఇరికించిన కామెడీ సినిమా ఫ్లోను దెబ్బతీయడమే కాకుండా, ఆ సన్నివేశాలకు ఉండాల్సిన ఇంపాక్ట్ ను పూర్తిగా పక్క దారి పట్టిస్తుంది. ఫైనల్ గా క్లైమాక్స్ మరియు చివరి భాగాలు ఎక్కడా థ్రిల్ లేదా ఉత్కంఠ లేకుండా తేలిపోయాయి.
సాంకేతిక వర్గం:
సిగ్మా లో నిర్మాణ విలువలు చాలా యావరేజ్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్, వి ఎఫ్ ఎక్స్ వర్క్ లు వీక్ గా ఉన్నాయి. థమన్ సంగీతం కూడా అంత రేంజ్ లో లేదు. కెమెరా వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ బాలేదు. ఇక దర్శకుడు జాసన్ సంజయ్ విషయంలో కొన్ని అంచనాలు ఉన్నాయి. కానీ నిరాశపరిచే అంశం ఏంటంటే తన వర్క్ ఈ సినిమాకి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. ఒక రొటీన్ కథను తీసుకొని తెరకెక్కించడానికి ప్రయత్నించాడు, కానీ అతని రైటింగ్, డైరెక్షన్ విఫలం అయ్యాయి. తను ఇంకా బెటర్ అవ్వాల్సి ఉంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘సిగ్మా’ ఒక బోరింగ్ యాక్షన్ ట్రీట్ గా మిగిలిపోయింది. హీరో సందీప్ కిషన్ తన వల్ల అయ్యినది అంతా ఈ సినిమా కోసం పెట్టేసాడు. తన హార్డ్ వర్క్, సిన్సియార్టీ ఇందులో కనిపిస్తుంది. కానీ జాసన్ కథా, కథనాల్లోనే చాలా బలహీనత ఉంది. సో హీరో ఆకట్టుకున్నా దర్శకుడు పనితనం ఇందులో డిజప్పాయింట్ చేస్తుంది. సో ఈ సినిమా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


