సమీక్ష: కీర్తి సురేష్ ‘డోరతి’ – కొందరికే కనెక్ట్ అయ్యే సున్నితమైన డ్రామా

సమీక్ష: కీర్తి సురేష్ ‘డోరతి’ – కొందరికే కనెక్ట్ అయ్యే సున్నితమైన డ్రామా

Published on Oct 2, 2026 3:44 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ మరియు ఇతరులు
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్
సంగీతం : ఇళయరాజా
ఛాయాగ్రహణం : S. తిరునావుక్కరసు
కూర్పు : గణేష్ శివ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1995 ఒక పల్లెటూరిలో సుబ్బు (సనంత్), కార్తీక్ (రిషికాంత్) చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కార్తీక్ మొండిగా, కోపిష్టిగా ఉంటే సుబ్బు మాత్రం అతనికి భిన్నంగా నెమ్మదిగా ఉంటాడు, తన వదిన డోరతీ (కీర్తి సురేష్)తో గడపడంలో ప్రశాంతంగా ఉంటాడు. అయితే, సుబ్బు ఇంట్లో జరిగిన ఒక ఊహించని విషాదం వారి ప్రశాంత జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత సుబ్బు తీసుకున్న ఒక అసాధారణ నిర్ణయం అతని కుటుంబాన్ని ఆగ్రహానికి గురిచేస్తుంది, అలాగే కార్తీక్‌ ని ఒక రకమైన సంఘర్షణ లోకి నెట్టేస్తుంది. సో ఈ కఠినమైన పరిస్థితి ఎలా ముగిసింది? అసలు సుబ్బు ఏం చేశాడు? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉంది అనేది తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఇతరులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నియంత్రించడానికి ఉపయోగించే పరువు అనే తప్పుడు భావనలపై దృష్టి పెడుతూ, కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ చుట్టూ తన కథను అల్లారు.

నటుడు రిషికాంత్ తన అద్భుతమైన నటనతో ఈ సినిమాకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచాడు. ఫస్టాఫ్ లో ఒకలా సెకాండాఫ్ లో మరో షేడ్ తో రెండు కోణాల్లో యువ నటుడు చాలా పరిపక్వతో కూడిన పెర్ఫార్మన్స్ ని తను అందించాడు. అలాగే తన నుంచి కార్తిక్ సుబ్బరాజ్ ఈ రేంజ్ లో రాబట్టడం అనేది విశేషం.

అలాగే నటుడు సనంత్ మాత్రం ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎవరూ ఓకే చేయరు కానీ దాన్ని ఒప్పుకొని దానికి అంతే పూర్తి న్యాయం సనంత్ చేసాడు. ఆ పాత్రలోని కోర్ ఎమోషన్ ని బాగా పండించి ఒక సిన్సియర్ పెర్ఫార్మన్స్ ని తను అందించాడు. అలాగే తన ఫ్రెండ్ తో సీన్స్ కూడా బాగున్నాయి.

ఇక కీర్తి సురేష్ కి సినిమాలో తక్కువ నిడివే దక్కింది కానీ సినిమా టైటిల్ గా ఊరికినే ఆమె పేరు పెట్టి సింపుల్ గా వదిలేయకుండా అంతే బలమైన రోల్ ని కార్తిక్ సుబ్బరాజ్ అందించి తక్కువ నిడివి లోనే చూపించినా బలమైన ఇంపాక్ట్ మాత్రం వడలగలిగాడు. కీర్తి కూడా అదే రేంజ్ లో పెర్ఫామ్ చేసింది. క్యారెక్టర్ నటుడు ముత్తుకుమార్ ‘విజిల్ వీరయ్య’గా తన పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. అలానే సింగిల్ టెక్ లో చేసిన ఓ కీలకమైన విషాద సన్నివేశం, అలాగే ప్రీ-ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ తరహా సబ్జెక్ట్ లు డెఫినెట్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం చాలా తక్కువ. ఇందులోని డెప్త్, ఎమోషన్స్ కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అనిపిస్తాయి. పైగా ఆల్రెడీ కోలీవుడ్ లో ముందే విడుదల కావడంతో సినిమాలో అసలు విషయం ముందే లీక్ అవ్వడం వల్ల తెలుగులో కొంచెం ఆసక్తి తగ్గుతుంది.

పైగా కథనం నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు మరో బలహీనతగా నిలిచింది. మొదటి గంట సేపు బాగానే సాగినప్పటికీ, కథ ప్రధాన ఘర్షణ వైపు వెళ్తున్నప్పుడు సెకండాఫ్ మాత్రం బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. కొన్ని రిపీట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి.

సాంకేతిక అంశాలు:

ఈ సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సెటప్ ని బాగా చేసుకున్నారు. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి పర్ఫెక్ట్ ఎంపిక అని సినిమా చూస్తే అర్ధం అవుతుంది. తిరు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. అలాగే తెలుగు డబ్బింగ్ మరియు పాటల డబ్బింగ్ ఇంప్రెస్ చేస్తాయి. ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకాండాఫ్.

ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సులభమైన కమర్షియల్ మార్గాన్ని ఎంచుకోకుండా, ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని ఈ సినిమాని చాలా వరకు నీట్ గా హ్యాండిల్ చేసాడు. కానీ కొన్ని చోట్ల మరింత జాగ్రత్త వహించాల్సింది. తన మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అయ్యింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే, ‘డోరతీ’ ఓకే అనిపించే ఓ డిఫరెంట్ అండ్ రేర్ అటెంప్ట్ గా నిలుస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ ని ఎంచుకొని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే నటీనటులు నుంచి సాలిడ్ పెర్ఫార్మన్స్ లు కూడా తాను రాబట్టారు. కానీ ఈ సబ్జెక్ట్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి డెఫినెట్ గా కనెక్ట్ కావడం కష్టం. పైగా సాగదీతగా, రిపీటెడ్ గా అనిపించే సీన్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, కొత్త నేపథ్యం ఉండే సినిమా చూడాలి అనుకునేవారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు