కంగనా ‘తలైవి’కి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

Published on Jun 23, 2021 12:04 am IST

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. పలు భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. చిత్రీకరణ కూడ ఇటీవలే పూర్తయింది.

తాజాగా తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. మొదటి నండి సినిమా ఎలా ఉంటుంది, అందులో ఏవైనా వివాదాస్పద అంశాలు ఉంటాయా అనే అనుమానాలు ఉండేవి. పైగా తమిళనాట ప్రభుత్వం మారింది కూడ. ఈ నేపథ్యంలో సినిమాకు సెన్సార్ బోర్డు కాలిన్ యు ఇవ్వడం హర్షించదగిన విషయం. త్వరలోనే తెలుగు, హిందీ భాషల సెన్సార్ పనులు జరగనున్నాయి. ఆగష్టు నెలలో సినిమా నేరుగా థియేటర్లలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :