రీసెంట్ గా విడుదల అయ్యిన చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ కూడా ఒకటి. ఈ సినిమాకి ఉన్న పలు హైలైట్స్ లో సంగీత దర్శకుడు అనిరుద్ వర్క్ కూడా ఒకటి. తన నుంచి ఓ భిన్నమైన రూటెడ్ ఆల్బమ్ ఇది కాగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫైలో ప్యారడైజ్ ఆల్బమ్ కొన్ని రోజులు కితం గ్లోబల్ లెవెల్లో టాప్ 5 లో నిలిస్తే, ఇప్పుడు ఇదే అనిరుద్ నుంచి వచ్చిన మరో ఆల్బమ్ గ్లోబల్ ఛార్ట్స్ లో ట్రెండ్ అవుతున్నట్టు తెలిపాడు. జైలర్ 2 ఆల్బమ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేస్తే వరల్డ్ వైడ్ గా స్పాటిఫై లో టాప్ 8లో ట్రెండ్ అవుతుంది.
దీనితో అనిరుద్ మాత్రం తన హవా కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ గా జైలర్ 2 ఆల్బమ్ కి ఫుల్ ఫ్లెడ్జ్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా రాకుండానే ఇలా జరగడం విశేషం. ఇక జైలర్ 2 ఈ అక్టోబర్ 15న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
#Jailer2 album on global top albums @Spotify and a 100 mil streams on audio platforms already 📈
Love you all 🫶 https://t.co/yxuR8gS4fx— Anirudh Ravichander (@anirudhofficial) October 6, 2026


