“సర్కారు వారి పాట” కోసం థమన్ సిసలైన వర్క్ షురూ!

Published on May 4, 2022 11:05 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం కోసం థమన్ సిసలైన వర్క్ ను మొదలు పెట్టారు. 24/7 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నట్లు తాజాగా ఒక ఫోటో ను షేర్ చేశారు. ఈ చిత్రం కి మ్యూజిక్ సైతం హైలెట్ గా ఉండే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :