రవితేజ కోసం మరోసారి తమన్ !
Published on Dec 3, 2017 8:04 pm IST

‘రాజా ది గ్రేట్’ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ రవితేజ త్వరలో శ్రీను వైట్లతో సినిమాను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందివ్వనున్నారు. రవితేజ, థమన్ ల మధ్య రిలేషన్ ఈనాటిది కాదు రవితేజ చేసిన 8 సినిమాలకు థమన్ సంగీతాన్ని అందించారు.

వాటిలో ‘కిక్, మిరపకాయ్, ఆంజనేయులు, వీర’ తో పాటు ‘కిక్-2’ కూడా ఉంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ‘రవితేజ నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. నేను సంగీత దర్శకుడిగా మారక ముందు అమ్మానాన్న ఓ తమిళమ్మాయ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలోని సినిమాకు పనిచేయనున్నాను’ అన్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు వంటి ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook