‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి చంద్రబాబు దొరికాడు !

Published on Oct 14, 2018 10:03 am IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. వీడియోలోని ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు చెబితే వారికి లక్ష రూపాయలను రివార్డ్ గా అందిస్తా’ అని వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది కూడా. ఆ వీడియాలోని వ్యక్తికి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి దగ్గర పోలికలు ఉన్నాయి. అందుకే అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసాయని.. రోహిత్ అనే వ్యక్తి తెలియజేసాడని వర్మ ట్వీట్ చేశాడు ‘‘హే రోహిత్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందానికి సి.బి.ఎన్ ని గిఫ్ట్ గా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా చిత్రం ప్రారంభంలో నీ పేరును తెరపై వేసి కృతజ్ఞతలు తెలుపుతా. నేను అన్న మాట ప్రకారం నీకు లక్ష రూపాయల రివార్డ్ ను ఇస్తాను. దయచేసి నీ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ పంపించు.’ అని వర్మ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ రోహిత్ ఎవరో గాని, చిన్న మెసేజ్ కే లక్ష పట్టేశాడు.

సంబంధిత సమాచారం :