ఆ ఇద్దరు కొత్త దర్శకులు విజయం సాధిస్తారా ?
Published on Feb 15, 2018 11:42 pm IST

నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన అ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాజల్, నిత్య మీనన్, మురళిశర్మ వంటి నటినటులు నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాజిటివ్ బజ్ తో వస్తోన్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించడంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత హైప్ వచ్చింది. రవితేజ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

మహేష్ బాబు సోదరి మంజుల మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారబోతున్నారు. సందీప్ కిషన హీరోగా నటించిన ఈ సినిమా యూత్ ను ఆకర్షించే ప్రేమకథగా రోపొందింది. మహేష్ బాబు ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ అ సినిమాతో మంజుల మనసుకు నచ్చింది సినిమాతో విజయం సాదిస్తారేమో చూడాలి.

 
Like us on Facebook