‘ది బెల్స్’ మూవీ రిలీజ్ డేట్
Published on Jun 28, 2015 8:10 am IST

the-bells
యంగ్ యాక్టర్ రేయాన్ రాహుల్ ని హీరోగా పరిచయం చేస్తూ నేహదేశ్ పాండే హీరోయిన్ గా నటించిన సినిమా ‘ది బెల్స్’. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. దాంతో ఈ చిత్ర టీం జూలై 3న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర టీం ఈ రోజు ఉదయం అనౌన్స్ చేసారు.

జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రవీణ్ చందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ది బెల్స్ సినిమాకి జాగృతి కోసం అనేది ట్యాగ్ లైన్. తెలంగాణ నేపధ్యంలో రానున్న ఈ రొమాంటిక్ లవ్ స్టొరీలో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు ఓ అతిధి పాత్రలో కనిపించనుండడం విశేషం. కాసర్ల శ్యాం మ్యూజిక్ అందించాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook