ఆసక్తి రేపుతున్న “ది ఢిల్లీ ఫైల్స్” పోస్టర్!

Published on Sep 13, 2021 3:15 pm IST


తెలుగు సినిమా పరిశ్రమ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారి తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశం ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ది ఢిల్లీ ఫైల్స్ అంటూ ఈ చిత్రం టైటిల్ ఉండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే పలు చిత్రాలతో అలరించిన ఈ సంస్థ ఇప్పుడు ఒక వివాదాస్పద అంశం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల అయిన అనంతరం నుండి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ సినిమా పోస్టర్ లో ఒక్ సిఖ్ బాలుడును మనం చూడవచ్చు. పోస్టర్ అంతా రెడ్ కలర్ లో ఉండటం తో ఇప్పటి వరకు చూడని ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :