న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారికంగా “A” (పెద్దలకు మాత్రమే) రేటింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని నాని స్వయంగా తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ తో పాటు ఒక అద్భుతమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మొదటి నుంచి ఈ చిత్రం ఒక బలమైన అనుభూతిని ఇస్తుందని హైలైట్ చేస్తూ వస్తున్నారు.
కాగా ఈ సినిమా పై ఉన్న ఆసక్తిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ నాని కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబోతున్నాయని అంచనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్‌లో ఆ నంబర్లు మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.


