అక్కడ మాత్రం వేరే లెవెల్లో “RRR” ఈవెంట్.?

Published on Dec 31, 2021 8:00 pm IST

ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఇంటర్వ్యూ లు అలాగే అన్ని కీలక భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లను కంప్లీట్ చేస్తూ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ కి దగ్గర అవుతున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆసక్తికర బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ ఈవెంట్ కి గాను ఇండియాస్ మరి భారీ సినిమా కేజీయఫ్ హీరో యష్ ప్రత్యేక అతిధిగా హాజరు కానున్నాడని ఇప్పుడు తెలుస్తుంది. దీనితో ఈ ఈవెంట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఒకే వేదిక మీద రెండు భారీ సినిమాల స్టార్స్ గ్రేస్ చేయడం అనేది సౌండింగ్ ఆసక్తిగా అనిపిస్తుంది. అలాగే ఈవెంట్ జనవరి 2న జరగనుంది అని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :