కమల్ ఆడియో వేడుకలో ఈ ఊహించని బిగ్ స్టార్స్..?

Published on May 14, 2022 8:00 am IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సాంగ్ మంచి చార్ట్ బస్టర్ కాగా ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ని ఈ మే 15న అత్యంత గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వేడుకకి గాను ముగ్గురు ఊహించని బిగ్ స్టార్స్ వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే తలపతి విజయ్ జోసెఫ్ మరియు స్టార్ హీరో సూర్య లు హాజరు కాబోతున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ నిజం అయితే అక్కడ వన్ ఆఫ్ ది బిగ్ ఈవెంట్ గా ఇది నిలుస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :