సీమా అవార్డ్స్ లో ఆ రెండు చిత్రాలకు ఎక్కువ అవార్డులు!

Published on Sep 20, 2021 11:47 am IST

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో ఈ సారి రెండు సినిమాలు ఎక్కువ అవార్డు లను సొంతం చేసుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన అలా వైకుంఠ పురంలో సినిమా కి మొత్తం 10 అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్ కి గానూ మొత్తం పది అవార్డులు రావడం విశేషం.

అదే విధంగా సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం లో వచ్చిన సూరారై పోట్రూ ( ఆకాశం నీ హద్దురా) చిత్రానికి 7 అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్), బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సినిమాటోగ్రఫర్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ లకు అవార్డులు వచ్చాయి. ఇందులో అలా వైకుంఠ పురంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, మరొక సినిమా సూరరై పొట్రూ డిజిటల్ రూపంలో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :