ఈ యాక్షన్ చిత్రం లో ఇద్దరు స్టార్ హీరోలు?

Published on Feb 17, 2023 12:00 am IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం హిందీ బెల్ట్‌లో బాహుబలి 2 కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించాడు. YRF స్పై యూనివర్స్ లో పఠాన్ భాగమని అందరికీ తెలిసిందే. హిందీ ఫిల్మ్ సర్కిల్స్‌ లో తాజా సంచలనం ఏమిటంటే, ప్రస్తుత YRF ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా, షారుఖ్ మరియు సల్మాన్ ఇద్దరూ పూర్తి నిడివి ఉన్న పాత్రలను పోషించే చిత్రాన్ని రూపొందించే యోచనలో ఉన్నారు.

షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మధ్య ఈ చిత్రం ఉంటుందని, మేకర్స్ ఇప్పటికే ప్లాట్‌ను ఓకే చేశారని టాక్. YRF ఫిల్మ్స్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ యొక్క టైగర్ 3 కోసం పని చేస్తోంది. ఇది కూడా వారి స్పై యూనివర్స్ లో భాగమే. 1995లో విడుదలైన కరణ్ అర్జున్ చిత్రంలో సల్మాన్, షారుఖ్ కలిసి నటించారు. ఈ వార్త నిజమైతే, ఈ చిత్రం బాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

సంబంధిత సమాచారం :