ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో షారుఖ్ “డంకి”..?

ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో షారుఖ్ “డంకి”..?

Published on Dec 22, 2023 4:00 PM IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తాప్సి పన్ను హీరోయిన్ గా టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం “డంకి”. మరి ఈ ఏడాదికి షారుఖ్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది కాగా ఈ చిత్రానికి కూడా షారుఖ్ డీసెంట్ టాక్ ని అయితే అందుకున్నాడు.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ని పక్కన పెడితే ఈ సినిమా ఓటిటి హక్కులకు సంబంధించి బజ్ తెలుస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏది కూడా అధికారికంగా మేకర్స్ రివీల్ చేయలేదు. కాకపోతే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రముఖ సంస్థ జియో సినిమా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో జియో స్టూడియోస్ వారు కూడా భాగం కాబట్టి దీనికి హై ఛాన్స్ లు ఉన్నట్టుగా సమాచారం. దీనితో డంకి సినిమా ఓటిటి పై అయితే మున్ముందు క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు