టాక్..”RRR” కి ఇంకా క్లియర్ కాని ఈ సమస్య.!?

Published on Dec 30, 2021 7:02 pm IST

జస్ట్ ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ ఇండియన్ సినిమా బాహుబలి తర్వాత దానికి మించిన భారీ సినిమా అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” ని విట్నెస్ చేయనుంది. అయితే అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా డే 1 కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అన్ని చోట్లా బాగానే ఉన్నా ఏపీలో పరిస్థితి మాత్రం కాస్త విభిన్నంగా మారింది.

అనేక కీలక మీటింగ్స్ అనంతరం సినిమాలకు మళ్ళీ హైక్ స్టార్ట్ అవుతుంది అని టాక్ వినిపించినా లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే “RRR” యూనిట్ కి ఈ సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తుంది. దీనితో ఈ భారీ సినిమా సాధారణ రేట్లు తోనే ఏపీలో ప్రదర్శితం కానుంది అని టాక్ వైరల్ అవుతుంది.

ఆల్రెడీ ఈ సినిమా ఏపీలో భారీ స్థాయి బిజినెస్ జరుపుకుంది. దీనితో చివరి నిమిషం వరకు మేకర్స్ అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి అనుకున్నారు కానీ ప్రస్తుతానికి అయితే సమయం తక్కువ ఉన్నా ఇవన్నీ సర్దుమణిగే సూచనలు అయితే లేవనే అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :