హిందీ లో కూడా ఒకేసారి రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య!

హిందీ లో కూడా ఒకేసారి రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య!

Published on Dec 25, 2022 9:24 PM IST

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన వాల్తేరు వీరయ్య, 2023 సంక్రాంతికి విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. వింటేజ్ మెగాస్టార్‌ను తిరిగి తీసుకు రానున్నట్లు చిత్ర దర్శకుడు బాబీ అభిమానులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. ఈరోజు హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఇందులో బాబీ మరియు నిర్మాతలు పాల్గొన్నారు.

విడుదల మరియు ప్రమోషన్లకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ధృవీకరించింది. ఈ సమయంలో బాలీవుడ్‌లో విడుదలకు పెద్దగా ఏమీ లేవు మరియు అక్కడ వాల్తేరు వీరయ్య ఎలా పర్ఫామెన్స్ చేస్తాడో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2023 జనవరి 13న విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు