టాక్..”చంద్రముఖి 2″ లో ఈ స్టార్ హీరోయిన్..?

Published on Jun 30, 2022 10:00 am IST


ఇప్పుడు మన దగ్గర సీక్వెల్స్ పర్వం ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. అలా రీసెంట్ గానే అనౌన్స్ అయ్యిన మరో క్రేజీ భారీ చిత్రం “చంద్రముఖి 2”. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు వాసు ల నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ “చంద్రముఖి” కి సీక్వెల్ గా స్టార్ హీరో రాఘవ లారెన్స్ తో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రంపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కానీ లేదా ఓ కీలక పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష కనిపించబోతున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో అయితే ఇంకా ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :