ఈ వారం కూడా మాస్ జాతర “అఖండ” దే.!

Published on Dec 12, 2021 10:00 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ చిత్రం “అఖండ”. మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్న ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.

అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఒకటే రీసౌండ్ తో సాలిడ్ వసూళ్లు రాబడుతూ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక గత వారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే జాతర షురూ చేసి ఈవారాంతం కూడా తనదే అనిపించుకుంది.

ఈ వారం రిలీజ్ అయ్యిన సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపే రేంజ్ లో లేకపోవడంతో ఈ వారం కూడా మాస్ జాతర అఖండ దే అని చెప్పాలి. అలాగే ఈ వారం వసూళ్లతో అఖండ బాలయ్య కెరీర్ లో ఫస్ట్ ఎవర్ బెంచ్ మార్క్ వసూళ్లు అందుకోనున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :