ఈ వారం థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలివే..!

Published on Mar 15, 2022 12:15 am IST


కరోనా పరిస్థితులు మెల్ల మెల్లగా చక్కబడడంతో కొద్ది రోజుల నుంచి పెద్ద, చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

1) జేమ్స్

కన్నడ దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల చేయనున్నారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

2) స్టాండప్ రాహుల్

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం “స్టాండ్ అప్ రాహుల్”. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్షా బొమ్మాళి కథానాయికగా నటిస్తుంది. మార్చి 18న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.

3) నల్లమల

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “న‌ల్ల‌మ‌ల‌”. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మార్చి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :