ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేది అప్పుడేనా?

Published on Jun 11, 2022 5:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర తాను కూడా భారీ స్టార్డం తెచ్చుకున్నాడు. దీనితో తన నుంచి రాబోయే “పుష్ప ది రూల్” తో అయితే డెఫినెట్ గా రూల్ చేస్తాడని అర్ధం అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత బన్నీ చేసే సినిమాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే మరి లేటెస్ట్ గా బన్నీ లైనప్ కి సంబంధించి టాక్ ఒకటి వినిపిస్తుంది.

బన్నీ ఈ జులై నుంచి పుష్ప పార్ట్ 2 ని స్టార్ట్ చేయనుండగా ఈ ఏడాది విజయ దశమి సందర్భంగా ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఎవరితో ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మళ్ళీ సిద్ధం అవుతున్నాడు. జూలై నాటికి మళ్ళీ పుష్ప రాజ్ లా మారిపోవడం గ్యారెంటీ.

సంబంధిత సమాచారం :