కోబలి ఆగిపోవడానికి గల కారణం చెప్పిన త్రివిక్రమ్ !

Published on May 27, 2018 11:21 am IST

అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ లు కలిసి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఒక సినిమా చేయబోతున్నారని అప్పట్లో దీని మీద చర్చలు జరిగియాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని త్రివిక్రమ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో కోబలి అనే సినిమా తెరకేక్కిన్చాలనుకున్న మాట వాస్తవం.దానికోసం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ తయారు చేసుకున్నాని దానికి టైటిల్ కోబలి అని పెట్టామని శత్రువుల ఫై దాడి చేస్తున్నప్పుడు కసి కోసం కోరు బలి నరుకు బలి అని గట్టిగా అరుస్తారని అందుకే ఆ టైటిల్ ఖరారు చేసానని సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందని కెమెరామెన్ ని కూడా తీసుకున్నామన్నారు.

కానీ అదే సమయానికి 2014 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మరో ఏడాది పాటు సినిమాలు చేయనని పవన్ కళ్యాణ్ గారు అనడంతో ఆ సినిమా ఆగిపోయిందన్నారు. కానీ ఈ సినిమా గురించి చేసిన పరిశోదన వల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగానని అవే ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకి చాలా ఉపయోగపడుతున్నాయని వివరించారు.

సంబంధిత సమాచారం :