‘రోగ్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులుగా స్టార్ హీరోలు ?
Published on Mar 7, 2017 11:25 am IST


నూతన నటుడు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి చేసిన సినిమా ‘రోగ్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కన్నడ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేగాక ఈ చిత్రం మరో ‘ఇడియట్’ అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతుండటంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి. సినీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం బెంగుళూరులో జరగనున్న ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు హాజరవుతున్నారని తెలుస్తోంది.

వాళ్ళే కన్నడ స్టార్ హీరోలు సుదీప్, శివరాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలు వేడుకకు వస్తున్నారనే వార్త బయటకు రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగి సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది. ఐతే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి హీరోయిన్లుగా నటిస్తుండగా అనూప్ ఠాకూర్ సింగ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

 
Like us on Facebook