ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో

ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో

Published on Sep 10, 2022 10:59 AM IST

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృంద గోపాల్ డైరెక్షన్ లో రియా షిబు, హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన లేటెస్ట్ మూవీ థగ్స్. పులి, ఇంకొకడు, సామి 2 తో పాటు పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిన షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ మూవీని నిర్మిస్తుండగా కుమారుడు హృదు హరూన్ హీరోగా థగ్స్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. సింహ, ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి శామ్ సి ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ లెవెల్లో రూపొందుతోంది. ఈ మూవీ యొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోని పలువురు సినిమా ప్రముఖుల సమక్షంలో చెన్నైలో ఎంతో వేడుకగా విడుదల చేసారు.

క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్ గా విడుదల అయిన ఈ వీడియో లో మూవీలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేశారు. ‘మాస్టర్ మైండ్’ సేతు గా హృదు, ‘రోగ్’ దురై గా సింహ, ‘బ్రూట్’ ఆరాకియా దాస్ గా ఆర్ కె సురేష్, ‘క్రుకెడ్’ మరుదు గా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో ఎంతో ఆకట్టుకుని ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వీడియో బైట్ రిలీజ్ చేస్తూ హీరో హృదు కి, దర్శకురాలు బృంద కి తన బెస్ట్ విషెస్ చెబుతూ థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని నవంబర్ లో థియేటర్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది థగ్స్ మూవీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు