మాస్ రాజాతో ఆ డైరెక్టర్ సినిమా.. ఎంతవరకు వచ్చిందో..?

మాస్ రాజాతో ఆ డైరెక్టర్ సినిమా.. ఎంతవరకు వచ్చిందో..?

Published on Oct 3, 2026 12:28 AM IST

మాస్ రాజా రవితేజ ఇటీవలి కాలంలో రొటీన్ మాస్ ఇమేజ్ నుంచి బయటపడి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటున్నాడు. ‘ఈగల్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘ఇరుముడి’ చిత్రంతో ఆయన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే మరిన్ని డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల దర్శకుడు హసిత్ గోలితో చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుండగా, ఇప్పుడు మరో న్యూ ఏజ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మాస్ రాజా జట్టుకట్టడం విశేషం. ‘మెంటల్ మదిలో’ నుంచి రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘సరిపోదా శనివారం’ వరకు ప్రతీ సినిమాను సరికొత్త కథాంశంతో తెరకెక్కించే వివేక్ ఆత్రేయ, రవితేజ కాంబినేషన్ అనౌన్స్ కావడంతోనే భారీ అంచనాలు నమోదయ్యాయి.

అయితే, ఈ సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నా చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందా.. అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు