అల్లు శిరీష్ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ రేపే

అల్లు శిరీష్ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ రేపే

Published on May 29, 2023 11:01 PM IST

యువ నటుడు అల్లు శిరీష్ ఇటీవల ఊర్వశివో రాక్షసీవో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. రొమాంటిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తదుపరి సినిమా టైటిల్ మరియు పోస్టర్ రేపు సాయంత్రం గం. 04. 05 ని. లకు ప్రకటించనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా ఆ సినిమా నుండి అల్లు శిరీష్ ఒక పోస్టర్ ని షేర్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది తమిళ్ లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్ అని తెలుస్తోంది.

అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. స్టూడియో గ్రీన్ ఈ సినిమాని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఇందులో నటించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు