తమిళనాడు థియేటర్లలో ఒక షో ఎక్ స్ట్రా గా పడనుంది !

Published on Jan 8, 2019 5:24 pm IST

కోలీవుడ్ లో ఈ పొంగల్ కు రెండు భారీ సినిమాలు థియేటర్లకు రానున్నాయి. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’ కాగా మరొకటి తల అజిత్ నటించిన ‘విశ్వాసం’. తమిళనాడులో ఈ ఇద్దరి హీరోలకి భారీ ఫాలోయింగ్ వుంది. దాంతో వీరి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు థియేటర్ల యజమానులు. అందులో భాగంగా తమిళ నాడు ప్రభుత్వం ఈనెల 10నుండి 20వ తేదీ వరకు అదనంగా షో వేసుకోవడనికి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఈ పది రోజులు అక్కడి థియేటర్లలో రోజుకి 5షోలు పడనున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే పెట్టా , విశ్వాసం ఫై తమిళ ప్రేక్షకుల్లోభారీ అంచనాలు ఉన్నాయి. ఫామ్ లో ఉన్న దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ పెట్టాను డైరెక్ట్ చేయడం ఒక అడ్వాంటేజ్ అయితే భారీ తారాగణం తో ఈ సినిమా తెరకెక్కడం మరో అడ్వాంటేజ్. ఇక శివ -అజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్క ‘వివేగం’ సినిమా తప్ప మిగితా రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం ఈ విశ్వాసం చిత్రానికి అడ్వాంటేజ్ కాగా ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబట్టుకోవడం కూడా ఈ సినిమా ఫై మంచి హైప్ ను తీసుకొచ్చింది. మరి ఈ పొంగల్ కు ఏ చిత్రం విన్నర్ గా నిలిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More