ప్రత్యేక హోదా నిరసనకు పెరుగుతున్న టాలీవుడ్ మద్దత్తు !

26th, January 2017 - 09:14:02 AM


ప్రత్యేకహోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ యువత ఈరోజు వైజాగ్లోని ఆర్కే బీచ్ వద్ద నిశ్శబ్ద నిరసన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనకు పలు రాజకీయ పార్టీలే గాక తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ సైతం తన మద్దత్తును తెలుపుతోంది. ఇప్పటికే అగ్ర హీరో పవన్ కళ్యాణ్ తన పూర్తి సపోర్టును ప్రకటించగా నిన్నటి నుండి పలువురు సెలబ్రిటీలు తమ సపోర్టును ప్రకటిస్తున్నారు.

హీరో రానా, నితిన్, రాజ్ తరుణ్, శివ బాలాజీ, ధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, వరుణ్ తేజ్ లతో పాటు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లు ట్విట్టర్ ద్వారా నిరసనను సపోర్ట్ చేస్తూ హింసాయుత మార్గం కన్నా ఇలా నిశ్శబ్ద నిరసన మేలైనది అన్నారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడ కోసం తమిళ ప్రజలు, తమిళ సినీ పరిశ్రమ కలిసి పోరాడి విజయం సాధించిన స్పూర్తితో తెలుగునాట ఇంతకూ ముందే మొదలైన ఈ ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉదృతంగా మారింది.